BREAKING

Uncategorized

Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ @ రూ.250 కోట్ల బడ్జెట్‌: జ్యోతికృష్ణ

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు జ్యోతికృష్ణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Site Subscription Price Supported Countries
FuboTV 5-day free trial, $10–$90/month USA, Canada, Spain
ESPN+ $11.99/month USA
Fanatiz €6.99–€10.99/month Worldwide
StreamLocator 7-day free trial, no credit card required! $9.90/month Worldwide
Advertisement

ఇంటర్నెట్‌డెస్క్: పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు జ్యోతికృష్ణ మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా బడ్జెట్‌ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. సుమారు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.  

‘‘పవన్‌ కల్యాణ్‌తో వర్క్‌ చేసే అవకాశం నాకు ఈ సినిమాతో దొరికింది. అదృష్టవంతుడిగా ఫీలవుతున్నా. ఇతరుల టాలెంట్‌ను ఆయన ఎంతగానో గుర్తిస్తారు. ఒక్కసారి నమ్మారంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆయన నన్ను నమ్మారు. నాతో సినిమా చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నా. ఇప్పటికే ఆయన సినిమా చూశారు. అది కూడా ఒక్కసారి కాదు మూడుసార్లు. దాదాపు గంటసేపు నన్నెంతో మెచ్చుకున్నారు. నాతో మరో సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఆయన మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. బందరు పోర్ట్‌కు సంబంధించి మన సినిమాలో ఒక భారీ సీక్వెన్స్‌ ఉంది. కథకు తగిన విధంగా సీజీలో ఈ పోర్ట్‌ రీ క్రియేట్‌ చేయడానికి సుమారు రెండేళ్లు కష్టపడ్డాం. పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. మీకు మంచి చిత్రాన్ని ఇచ్చేందుకు ఆయన ఎంతో శ్రమించారు’’ అని జ్యోతికృష్ణ చెప్పారు.

హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీగా ఈ సినిమా సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్‌ కథానాయిక. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. రెండు భాగాల్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జూన్‌ 12న దీనిని విడుదల చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని శుక్రవారం టీమ్‌ ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని చెప్పింది.

Site Subscription Price Supported Countries
FuboTV 5-day free trial, $10–$90/month USA, Canada, Spain
ESPN+ $11.99/month USA
Fanatiz €6.99–€10.99/month Worldwide
StreamLocator 7-day free trial, no credit card required! $9.90/month Worldwide
Advertisement

Related Posts